- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో కేసులో కీలక పరిణామం: బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకు లీగల్ పరంగా పెద్ద ఉపశమనం లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకు లీగల్ పరంగా పెద్ద ఉపశమనం లభించింది. భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గురువారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పును ప్రకటించారు. రూ.1 లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు (Sureties) సమర్పించాలని, కోర్టు విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశిస్తూ భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు పరీక్షలు రాసేందుకు లోయర్ కోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక (ఇంటరిమ్) బెయిల్ ఇవ్వగా.. గడువు ముగిసిన తర్వాత ఆయన జూన్ 25న తిరిగి జైలులో లొంగిపోయారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
మే 16న అరెస్ట్..
మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు మే 16వ తేదీన భగీరథను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి కేంద్ర జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దాదాపు 49 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించిన తరుణంలో, పోలీసుల దర్యాప్తు కూడా ముగింపు దశకు చేరినందున బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరఫు సీనియర్ న్యాయవాదులు కోర్టును కోరారు. కాగా, నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ బాధితురాలి తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. హైకోర్టు నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.






