- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : ఉప్పు మాత్రమే అధిక రక్తపోటుకు కారణమా?
అధిక రక్తపోటు విషయంలో చాలామంది ఉప్పును మాత్రమే దోషిని చేస్తారు. కానీ ప్రధాన కారణాల్లో చక్కెర కూడా ఒకటని పరిశోధనలు చెబుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : బీపీ ఎక్కువగా ఉంటోందా? అయితే సాల్ట్ తక్కువగా తినండి అంటుంటారు చాలామంది. అయితే కేవలం ఉప్పు మాత్రమే అందుకు కారణం కాకపోవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. పలు మెటా ఎనాలిసిస్ అధ్యయనాలు (2014, 2020) రుచికరమైన చక్కెరలు సైతం అధిక రక్తపోటును పెంచుతాయని పేర్కొంటున్నాయి. ముఖ్యంగా షుగర్ డ్రింక్స్ వినియోగం హైబీపీ, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయని వెల్లడించాయి. ఇంకా ఏయే సమస్యలు వస్తాయి? రాకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రెషర్) విషయంలో చాలామంది ఉప్పును మాత్రమే దోషిని చేస్తారు. కానీ చక్కెర కూడా ప్రధాన కారణాల్లో ఒకటని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోడాలు, జ్యూస్‌లు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ (మైదా, స్వీట్స్) నుంచి వచ్చే అధిక చక్కెర రక్తపోటును పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు వీటిని ఎక్కువగా తీసుకోవడంవల్ల ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. దీంతో కాలక్రమేణా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి, మూత్రపిండాలు ఎక్కువ ఉప్పును, నీటిని నిలుపుకుంటాయి. దీంతో రక్తపోటు పెరుగుతుంది.
పరిశోధనల ప్రకారం.. షుగర్ డ్రింక్స్ మాత్రమే హైపర్‌టెన్షన్ ప్రమాదాన్ని సుమారు 26% పెంచుతాయి. అందుకే హైబీపీ సమస్య రాకుండా ఉండాలంటే.. చక్కెర, రిఫైన్డ్ కార్బ్స్ (Sugar and refined carbs) వాడకం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో రక్తపోటు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా సోడాలు, కోల్డ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, స్వీటెన్డ్ టీ/కాఫీ, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్, స్వీట్స్, కేకులు, ఐస్‌క్రీమ్, మైదా ఉత్పత్తులు వంటివి తినడం చాలా వరకు తగ్గించాలి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






