గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో గండిపోచమ్మ ఆలయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-09 13:21:09  IST  )

ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదికి వరద నీరు ప్రవాహం పోటెత్తింది. పోలవరం జిల్లా దేవీపట్నంలో గండిపోచమ్మ తల్లి ఆలయంలోకి గోదావరి వరద నీరు చేరింది...

గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో గండిపోచమ్మ ఆలయం
X

దిశ, వెబ్ డెస్క్: ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదికి వరద నీరు ప్రవాహం పోటెత్తింది. పోలవరం జిల్లా దేవీపట్నంలో గండిపోచమ్మ తల్లి ఆలయంలోకి గోదావరి వరద నీరు చేరింది. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఆలయంలోని గర్భ గుడిలోకి సైతం వరద నీరు ప్రవేశించింది. ఆలయ సమీపంలోనూ షాపులు, రహదారులు సైతం నీట మునిగాయి. దీంతో భక్తులు ఎవరూ ఆలయానికి రావొద్దని నిర్మాహకులు పిలుపునిచ్చారు. వరద తగ్గిన తర్వాత మళ్లీ సమాచారం ఇస్తామని, అప్పటి వరకూ ఆలయం వద్దకు భక్తులు, పర్యాటకులు రావొద్దని సూచించారు.. మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చిన తర్వాత ఆలయ ప్రవేశం పున:ప్రారంభమవుతుందని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. మరోవైపు రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story