రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

by Batti.Sumithra |

మండలంలోని దిమ్మదుర్తి గ్రామ సమీపంలోని డాంబర్ ప్లాంట్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖానాపూర్ మండలం రాజుర గ్రామానికి చెందిన దశరథ్ రెడ్డి (50) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, మామడ : మండలంలోని దిమ్మదుర్తి గ్రామ సమీపంలోని డాంబర్ ప్లాంట్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖానాపూర్ మండలం రాజుర గ్రామానికి చెందిన దశరథ్ రెడ్డి (50) మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దిలావర్‌పూర్ మండలం పాత సాంగ్వి గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా, మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామ సమీపంలో రహదారిపై కుక్క అడ్డురావడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గంగడి దశరథ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గంగడి పుష్పలత, గంగారెడ్డి, లింగారెడ్డి, భీమ్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి 108 ఈఎంటి సురేష్, పైలట్ హఫీజ్ ప్రథమ చికిత్స అందించి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story