మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్ట్

by Taduka Kalyani |

మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.

మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్ట్
X

దిశ, జగదేవపూర్: మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. గురువారం జగదేవపూర్ ఎస్ ఐ కృష్ణారెడ్డి ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. జగదేవపూర్ గ్రామానికి చెందిన వల్లపు కనకయ్య (35) మంగళవారం అర్ధరాత్రి జగదేవపూర్ కు చెందిన కొంపల్లి కవిత పై విచక్షణారహితంగా దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు. నేరానికి ఉపయోగించిన ఏపీ 36 టిఏ 6530 నెంబర్ గల ఆటోతో పాటు ఘటన సమయంలో ధరించిన రక్తపు మరకలు ఉన్న దుస్తులు, కేసుకు సంబంధించిన ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.

Next Story