- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడురోజుల తర్వాత షాకిచ్చిన బంగారం ధర.. ఒక్కరోజే రెండుసార్లు జంప్
వరుసగా మూడురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఇవాళ ఒక్కరోజే బంగారం ధర రెండుసార్లు పెరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: వరుసగా మూడురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఇవాళ ఒక్కరోజే బంగారం ధర రెండుసార్లు పెరిగింది. ఆషాఢమాసం మొదలు కానున్న వేళ ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్న తరుణంలో.. ఊహించని రీతిలో ధర పెరగడంతో కొనుగోలుదారులు షాకవుతున్నారు. ఉదయం 10 గంటల సమయంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. సాయంత్రం 3 గంటల తర్వాత మరోసారి పెరిగింది. మొత్తంగా గురువారం ఒక్కరోజే గోల్డ్ రేటు రూ.1200 నుంచి రూ.1310 వరకూ పెరిగింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1310 మేర పెరిగి రూ.1,44,440కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1200 మేర పెరిగి.. రూ.1,32,400కు చేరింది. పెరిగిన ధరలకు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ అదనంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయని కొనుగోలుదారులు గమనించాలి. ఇక కేజీ వెండి ధర రూ.2,45,000గా ఉంది.






