- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీయూ (ITU) ‘డబ్ల్యూఎస్ఐఎస్’ గ్లోబల్ విన్నర్‌గా ‘సమృద్ధ్ గ్రామ్’ ప్రాజెక్ట్!
‘సమృద్ధ్ గ్రామ్’ (Samriddh Gram) ఇంటిగ్రేటెడ్ ఫిజిటల్ సర్వీసెస్ ప్రాజెక్ట్.. ITU ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘WSIS Prizes 2026’ గ్లోబల్ విన్నర్‌గా నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వేదికపై భారత డిజిటల్ విప్లవానికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సమృద్ధ్ గ్రామ్’ (Samriddh Gram) ఇంటిగ్రేటెడ్ ఫిజిటల్ సర్వీసెస్ ప్రాజెక్ట్.. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘WSIS Prizes 2026’ గ్లోబల్ విన్నర్‌గా నిలిచింది. ఈ అవార్డును 'ఎనేబ్లింగ్ ఎన్విరాన్‌మెంట్' (Enabling Environment) విభాగంలో భారతదేశం కైవసం చేసుకుంది.
ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ విజన్‌కు దక్కిన గౌరవం..
ఈ అంతర్జాతీయ పురస్కారంపై కేంద్ర సమాచార, టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హర్షం వ్యక్తం చేశారు. "కేంద్ర టెలికాం శాఖకు చెందిన 'సమృద్ధ్ గ్రామ్' ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ గ్లోబల్ విన్నర్‌గా ప్రకటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇది నిజంగా భారతదేశానికి గర్వకారణమైన క్షణం. సమ్మిళిత డిజిటల్ ఇండియా, 'వికసిత్ భారత్' (Vikit Bharat) సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్న దూరదృష్టితో కూడిన ఆలోచనలకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు ఇది" అని ట్విట్టర్ (X) వేదికగా కొనియాడారు. గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్, భౌతిక సేవలను అనుసంధానిస్తూ (Phygital) సమాజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.






