- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BSNL సంచలనం.. టవర్స్ తో అవసరమే లేదు.. దేశంలో అధునాతన శాటిలైట్ ఫోన్ లాంచ్
మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లోనూ పనిచేసే సరికొత్త శాటిలైట్ ఫోన్ను BSNL లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూడండి.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సంచలనం సృష్టించింది. దేశీయ మార్కెట్‍లోకి అధునాత శాటిలైట్ ఫోన్ను లాంచ్ చేసింది. మొబైల్ నెట్‌వర్క్‌లు అసలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త శాటిలైట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. పన్నులతో కలిపి ఈ ఫోన్ ధరను రూ.1,34,166 గా నిర్ణయించారు. సాధారణ స్మార్ట్‌ఫోన్‌లలా కాకుండా, మొబైల్ టవర్ల అవసరం లేకుండా నేరుగా ఉపగ్రహాల (Satellites) సహాయంతో ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఈ ఫోన్ ప్రత్యేకతలు ఇవే:
ఈ హ్యాండ్‌సెట్‌ను అంతర్జాతీయ శాటిలైట్ నెట్‌వర్క్ ప్రొవైడర్ అయిన ఇన్మార్శాట్ (Inmarsat) భాగస్వామ్యంతో BSNL అభివృద్ధి చేసింది. మొబైల్ టవర్ల పరిధితో సంబంధం లేకుండా దేశంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచైనా నేరుగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. తుఫానులు, భూకంపాల వంటి అత్యవసర సమయాల్లో లేదా మొబైల్ టవర్లు లేని అడవులు, కొండ ప్రాంతాలలో సైతం ఇది వాయిస్ కాల్స్ మరియు ఎమర్జెన్సీ సపోర్ట్‌ను అందిస్తుంది. అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించేందుకు ప్రత్యేక ఎస్‌ఓఎస్ ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు. లాంగ్ లైఫ్ బ్యాటరీతో దీన్ని రూపొందించడం వల్ల విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఎలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా అత్యంత బలంగా రూపొందించబడింది.
DoT అనుమతి తప్పనిసరి:
ఈ శాటిలైట్ ఫోన్‌ను సాధారణ ప్రజలు నేరుగా కొనుగోలు చేయడానికి వీలుండదని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. భారతదేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై కఠినమైన నిబంధనలు ఉన్న ఈ శాటిలైట్ ఫోన్ సాధారణ ఆన్‌లైన్ స్టోర్లలో లేదా రిటైల్ మొబైల్ షాపుల్లో దొరకదు. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారులు నేరుగా తమ సమీప బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని ఆశ్రయించాలి. అక్కడ కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) నుంచి ముందస్తుగా ప్రత్యేక అనుమతి తీసుకోవడం తప్పనిసరి. జాతీయ భద్రత, వ్యూహాత్మక కారణాల దృష్ట్యా ఈ ఫోన్‌ను ఏ అవసరం కోసం కొనుగోలు చేస్తున్నారనే పూర్తి వివరాలను బీఎస్ఎన్ఎల్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. కంపెనీ నిర్దేశించిన నిబంధనలు, అర్హత ప్రమాణాలకు లోబడి, అవసరమైన అనుమతులు లభించిన తర్వాతే ఈ హ్యాండ్‌సెట్‌ను విక్రయిస్తారు. అనుమతి లేకుండా దీనిని కలిగి ఉండటం లేదా వాడటం చట్టరీత్యా నేరం. ఈ సేవలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వినియోగదారులు తమ సమీపంలోని BSNL కార్యాలయాన్ని సందర్శించవచ్చు లేదా 9768866652 నంబర్‌ను సంప్రదించవచ్చు.
ఈ ఫోన్ ఎవరికి ఉపయోగపడుతుంది?:
సాధారణ పౌరుల కంటే కూడా నిర్దిష్ట రంగాల్లో క్లిష్టమైన విధుల్లో ఉన్నవారి కోసం బీఎస్ఎన్ఎల్ రూపొందించిన ఈ శాటిలైన్ ఫోన్ బాగా ఉపయోగపడనుంది. రక్షణ రంగం, సరిహద్దు భద్రతా దళాలు, సముద్రయాన, నౌకాదళ కార్యకలాపాలు, విపత్తు నిర్వహణ సంస్థలు, మైనింగ్, మారుమూల పారిశ్రామిక ప్రాజెక్టులు, అడ్వెంచర్ ట్రావెలర్స్, పర్వతారోహకుల.. వంటి ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. దీనినే 'కాల్ లాగ్' అంటారు. అయితే ఈ ఫోన్ ద్వారా మాట్లాడే ప్రతి కాల్ కూడా అత్యంత ఖరీదైనదిగా ఉండబోతోంది. ఒక్క నిమిషం కాల్ మాట్లాడటానికి దాదాపు 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందనే టాక్ వినిపిస్తోంది.






