- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్రంలో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

దిశ, సంగారెడ్డి : రాష్ట్రంలో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీవో భవన్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి జర్నలిజం నాలుగో స్తంభం అని, వార్తల్లో వేగం అవసరమే, కానీ విశ్వసనీయత అంతకంటే ముఖ్యమైనదన్నారు. సత్యం, నైతికత, సామాజిక బాధ్యతలను జర్నలిజం ఎల్లప్పుడూ పరిరక్షించాలనీ సూచించారు. ప్రజల గొంతుకగా, సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా మీడియా మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డు మంజూరి విషయంలో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. వీటితోపాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఒకప్పుడు నేను జర్నలిస్టునే... ఆ బాధ ఏంటో నాకు తెలుసు- రఘునందన్ రావు, మెదక్ ఎంపీ
ఒకప్పుడు తానూ విలేకరిగా పని చేశానని ఆ ఫీల్డ్ లో ఎలాంటి బాధలు ఉంటాయో తనకు కూడా తెలుసని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ రాత్రి అమెరికా పర్యటన ఉన్నా కూడా జర్నలిస్టుల ఆహ్వానాన్ని మన్నించి, ఇది ఎంతో ముఖ్యమని భావించి ఈ మహాసభ కు రావడం జరిగిందని ఎంపీ వివరించారు. జర్నలిస్టులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని ఆయన విలేకరులకు హామీ ఇచ్చారు.
ప్రాణాలు పణంగా పెట్టి పని చేసే జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఎంతో అవసరం- టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ
నిత్యం వార్త సేకరణలో తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యం లెక్కచేయకుండా పని చేస్తున్న జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఎంతో ముఖ్యమని టియుడబ్ల్యుజే సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. జర్నలిస్టులకు గత ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేసిందని, కానీ అవి కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే పని చేశాయని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జర్నలిస్టులకు అందించే హెల్త్ కార్డు విషయంలో మామూలు ఉద్యోగుల నుంచి సంవత్సరానికి ఎలా రుసుము చెల్లించి తీసుకుంటున్నారో వాటి దగ్గర కూడా తీసుకుంటే బాగుంటుందని ఆయన మంత్రికి తెలిపారు. గతంలో ఫ్రీగా హెల్త్ కార్డు ఇవ్వడంతో అవి చాలా చోట్ల పనిచేయకుండా అనేకమంది జర్నలిస్టులు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొని తిరిగి అవి పని చేయకుండా పోయాయని వాపోయారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేసే విలేకరులు అందరికీ ప్రభుత్వం తక్షణమే ఇల్లు కట్టుకునే వారికి రూ.10 లక్షలు మంజూరు చేయాలని ఆయన మంత్రిని కోరారు. అయితే కొంతమంది విలేకరులు జిల్లాలో ఇప్పటికే ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారని వారికి వెంటనే అట్టీ డబ్బులు చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు జర్నలిస్టులకు అవసరమైన ప్లాటు, ఇల్లు ఇతర సంక్షేమ ఫలాలు మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సభాముఖంగా మంత్రిని కోరారు.






