- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు కోడ్స్ రద్దు చేయాలి
కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.

దిశ, ఘట్కేసర్: 29 చట్టాలను రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఘట్ కేసర్ మండల ఏఐటీయూసీ మండల 4వ మహాసభ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి జయచంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిదులుగా ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులు రవిచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ లు హాజరై మాట్లాడారు.
కార్మికులకు వ్యతిరేకంగా అదానీ, అంబానీ లాంటి పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తున్నారని ఫైర్ అయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం రూ.26 వేల జీతం ఇవ్వాలన్నారు. ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులందరం మరిన్ని ఐక్యపోరాతలకు సిద్ధమై పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు లోట్టి ఈశ్వర్ , మున్సిపల్ సంఘం నాయకులు రామచందర్ సమక్షంలో ఘట్కేసర్ మండల ఎఐటియుసి అధ్యక్షులుగా బాలనర్సయ, మండల కార్యదర్శిగా శ్రీనివాసరావు, మండల గౌరవ అధ్యక్షులుగా కల్లూరి జయచంద్ర లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.






