ఖమ్మం-II ఎక్సైజ్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి

by Taduka Kalyani |

ఖమ్మం-II ఎక్సైజ్ స్టేషన్‌ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఖమ్మం-II ఎక్సైజ్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం-II ఎక్సైజ్ స్టేషన్‌ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ బి. చంద్రమోహన్, ఎస్‌ఐలు, సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ నేరాల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా గుడుంబా తయారీ, బెల్లం అక్రమ రవాణా వంటి ఎక్సైజ్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజల సహకారంతో ఎక్సైజ్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు కృషి చేయాలని అధికారులు సూచించారు.

Next Story