ఆర్మూర్ కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

by Batti.Sumithra |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోర్టుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం హాజరయ్యారు.

ఆర్మూర్ కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోర్టుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం హాజరయ్యారు. తీన్మార్ మల్లన్న పై ఆర్మూర్ కోర్టులో నమోదైన కేసుల విచారణ సందర్భంగా మల్లన్న గురువారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఆర్మూర్ కోర్టుకు చేరుకుని జడ్జి ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై నమోదైన కేసుల విషయమై ఆర్మూర్ కోర్టులో ఆర్మూర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, మాజీ ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ లు వాదనలు చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై నమోదైన కేసులను కోర్టులో జడ్జి పరిశీలించి తదుపరి కోర్టులో విచారణకు హాజరు కావలసిన విషయాలను పరిశీలించారు.

Next Story