గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..

by Taduka Kalyani |

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..
X

దిశ, నారాయణఖేడ్: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీ సభ్యులు శ్రీనివాస్ , జిల్లా కాంగ్రెస్ నాయకులకు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తహేర్ అలీ, సర్పంచ్ అనిల్ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు గురువారం బాణాపూర్ గ్రామంలో ఘన స్వాగతం పలికారు. బాణాపూర్ గ్రామంలో జాతీయ ఉపాధి పథకం ద్వారా రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉపాదా మీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధాని తన ఇస్తున్నమని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల కట్టుబడి ఉందంటూ, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నారన్నారు. దశలవారీగా గ్రామంలో పనులు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మాడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బాణాపూర్ సిసి రోడ్డు గ్రామస్తులకు సుదీర్ఘకాలపు రవాణా ఇబ్బందులు తొలగిపోతాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి అంతర్గత రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Next Story