- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్వారక గ్రాండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
by velandi.Saikiran |
ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని శ్రీ ద్వారక గ్రాండ్ర రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, కూకట్పల్లి: ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని శ్రీ ద్వారక గ్రాండ్ర రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, రెస్టారెండ్ కిచెన్లో పిల్లులను యజమాని పెంచడం చూసి అవాక్కయ్యారు. పదుల సంఖ్యలో పిల్లులు కిచెన్లో సంచరిస్తు కనిపించాయి. దానికి తోడు కిచెన్, రెస్టారెంట్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ గడువు ముగియడంతో రెస్టారెండ్ యజమానులకు నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. రెస్టారెంట్లోని కిచెన్, డైనింగ్ ప్రాంతాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రెస్టారెంట్ పూర్తి స్థాయి నిబంధనలకు ఖచ్చితంగా పాటించాలని సీఎంసీ అధికారులు ఆదేశించారు.
Next Story






