- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో ఖమేనీ అంత్యక్రియలు జరగనున్న నగరంపై అమెరికా దాడి
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ముగింపు ఘట్టం జరగాల్సిన మషద్ నగరంపై అమెరికా మిలిటరీ బలగాలు వ్యూహాత్మక లక్ష్యాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్: ముగిసిపోయింది అనుకున్న అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మళ్లీ మొదలైంది. కొద్ది సేపట్లో ఖమేనీ అంత్యక్రియలు జరగాల్సిన నగరంపై తాజాగా అమెరికా భారీ దాడి చేసింది. దీంతో ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా కుప్పకూలింది. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ముగింపు ఘట్టం ఆయన స్వస్థలమైన మషద్ నగరంలో జరుగుతున్న సమయంలోనే అమెరికా మిలిటరీ బలగాలు ఇరాన్‌లోని వ్యూహాత్మక లక్ష్యాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి.
ఉత్తర ఇరాన్‌లో చైనా, రష్యాలతో ఇరాన్ జరిపే అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మషద్ రైల్వే మార్గంలోని వంతెనలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో పాటు రష్యా సహకారంతో నిర్మించిన ఇరాన్‌లోని అత్యంత కీలకమైన బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్ సమీప పరిసర ప్రాంతాలపై కూడా అమెరికా క్షిపణులు దాడి చేయడంతో అక్కడ భారీ పేలుళ్లు సంభవించాయి.
ఈ దాడులకు కొన్ని గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక సంధి కాలం ముగిసిపోయిందని సంచలన ప్రకటన చేశారు. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ పరిధిలోని రక్షణ, వ్యూహాత్మక స్థావరాలపై దాడులు చేసినట్లు సమాచారం అందుతోంది. కాగా, బుషెహర్ అణు కర్మాగారానికి ప్రస్తుతానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఆర్మీ కూడా గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లలోని అమెరికా మిలిటరీ బేస్‌లు, క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైళ్లతో ఎదురుదాడికి దిగడంతో పశ్చిమాసియాలో మరోసారి పూర్తి స్థాయి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.






