తెలంగాణ బీజేపీలో చేరికలపై జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలంగాణలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై కీలక దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ బీజేపీలో చేరికలపై జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో చేరికలపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పర్యటనలో ఉన్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఈ సందర్భంగా జేపీ నడ్డా వెల్లడించారు. వేరే పార్టీల నుంచి నాయకులు వచ్చినప్పుడే పార్టీ మరింత బలపడుతుందన్నారు. ఈ సందర్భంగా తన సొంత రాష్ట్ర అనుభవాలను పంచుకుంటూ.. "హిమాచల్ ప్రదేశ్‌లో మేం అనేక మంది కాంగ్రెస్ కీలక నేతలను బీజేపీలో చేరేలా చేశాం. అదే వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను ఆహ్వానించి, సమన్వయంతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర నేతలకు జేపీ నడ్డా సూచించారు.

సీఎం రేవంత్‌ రెడ్డి మ్యాథ్స్ లో వీక్:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జేపీ నడ్డా ఈ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాథమెటిక్స్ లో చాలా వీక్ అని నడ్డా ఎద్దేవా చేశారు. లెక్కలపై అవగాహన లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయడం లేదంటూ రేవంత్ రెడ్డి నిరంతరం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనలతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Next Story