అక్రమ రవాణాపై అటవీ శాఖ దాడి

by velandi.Saikiran |

కొత్తగూడ మండలం ముస్మి గ్రామ పరిధిలో అటవీ శాఖ అధికారులు భారీగా కలపను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ రవాణాపై అటవీ శాఖ దాడి
X

దిశ, కొత్తగూడ: కొత్తగూడ మండలం ముస్మి గ్రామ పరిధిలో అటవీ శాఖ అధికారులు భారీగా కలపను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజ్ అధికారి వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో సుమారు రూ. లక్ష విలువైన కలప పట్టుబడింది. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అటవీ శాఖ అధికారి వంశీ కృష్ణ తెలిపారు. అటవీ సంపదను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సెక్షన్ అధికారులు, బిట్ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story