మారుతీనగర్‌లో డ్రైనేజీ సమస్యకు మోక్షం.. ఎమ్మెల్యే నిధులతో పనులు షురూ

by Gantepaka Srikanth |   (  Updated:2026-07-09 11:55:04  IST  )

అంబర్​పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​సొంత నిధులతో డ్రైనేజీ పైపులైన్​పనులను ప్రారంభిస్తున్నట్లు మారుతీనగర్​అధ్యక్షులు సురేశ్​గౌడ్ తెలిపారు.

మారుతీనగర్‌లో డ్రైనేజీ సమస్యకు మోక్షం.. ఎమ్మెల్యే నిధులతో పనులు షురూ
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: అంబర్​పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​సొంత నిధులతో డ్రైనేజీ పైపులైన్​పనులను ప్రారంభిస్తున్నట్లు మారుతీనగర్​అధ్యక్షులు సురేశ్​గౌడ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ 3వ వీధిలో డ్రైనేజీ పైపులైన్​ శిథిలావస్థకు చేరడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎమ్మెల్యే సొంత నిధులతో కొత్త డ్రైనేజ్ పైపులు కొనుగోలు చేసి, పాత లైన్ స్థానంలో కొత్త డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. కాలనీవాసులు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ జనరల్​ సెక్రటరీ నవకాంత్, కాలనీవాసులు పాల్గొన్నారు.

Next Story