- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారిపై పోరాడుతూనే ఉంటా: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
పరిటాల సునీత కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: పరిటాల సునీత కుటుంబం(Parital Sunitha Family) నుంచి తనకు ప్రాణహాని ఉందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy) అన్నారు. అనంతపురం(Ananthapur)లో నెలకొన్న హైటెన్షన్ నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ తనకు ప్రాణ హాని కలిగించేందుకు తన గన్ మెన్లు తొలగించారని ఆరోపించారు. ఇప్పటికే శింగనమల వద్ద టిప్పర్‌తో ఢీ కొట్టేందుకు యత్నించారని తెలిపారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు డైవర్ట్ చేస్తున్నారని, ఇందులో భాగంగానే దళిత ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో డ్రామాలు ఆడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అద్దెకు ఉంటున్న ఇంటిని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొనుగోలు చేశారని తనకు తెలిసిందని, తనను రోడ్డున పడాలన్నదే పరిటాల ఉద్దేశమని ఆరోపించారు. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించటం దుర్మార్గమని మండిపడ్డారు. పరిటాల కుటుంబం ఆగడాలపై పోరాడుతూనే ఉంటానని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.






