జూలై 11న యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం

by Batti.Sumithra |

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 11వ తేదీ ఉదయం 11.37 గంటలకు ప్రధాన ఆలయంలోని బంగారు వాకిలి వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వైభవంగా జరగనుంది.

జూలై 11న యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 11వ తేదీ ఉదయం 11.37 గంటలకు ప్రధాన ఆలయంలోని బంగారు వాకిలి వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వైభవంగా జరగనుంది. ఆలయ ఈవో జె.భవానీశంకర్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, ఇప్పటికే దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆయనతో పాటు మొత్తం 18 మంది సభ్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు. సభ్యుల్లో ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం దేవస్థానం ప్రెసిడెంట్ సూట్‌లో నూతన ట్రస్ట్ బోర్డు తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పరిపాలనా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

Next Story