- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకేసారి 61 మంది ఏజీఎంయూటీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ
కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం.. ఏజీఎంయూటీ (AGMUT) క్యాడర్‌కు చెందిన 61 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానితో పాటు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, కేంద్రపాలిత ప్రాంతాల (AGMUT) క్యాడర్‌కు చెందిన 61 మంది ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారులను ఒకేసారి బదిలీ చేస్తూ గురువారం కేంద్ర హోం శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
పరిపాలనలో వేగం పెంచేందుకు బదిలీలు..
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ తాజా రీషఫిల్ (Reshuffle) ఉత్తర్వుల ప్రకారం.. పలు కీలక జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, వివిధ శాఖల సెక్రటరీల స్థానాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి సున్నితమైన మరియు కీలక ప్రాంతాలలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడానికి, ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచడానికి ఈ భారీ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా ఒకే స్థానంలో ఉన్న అధికారులతో పాటు, సీనియర్ అధికారులకు ఈ బదిలీల్లో కొత్త బాధ్యతలను అప్పగించారు.






