రాక్‌బాల్ విజేత క్రీడాకారున్ని సన్మానించిన ఎమ్మెల్యే మర్రి

by velandi.Saikiran |

రాక్ బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయానికి తోడ్పడిన క్రీడాకారుడిని సన్మానించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

రాక్‌బాల్ విజేత క్రీడాకారున్ని సన్మానించిన ఎమ్మెల్యే మర్రి
X

దిశ, అల్వాల్: రాక్ బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయానికి తోడ్పడిన క్రీడాకారుడిని సన్మానించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. దక్షిణాసియాలో జరిగిన రాక్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయానికి విశేషంగా కృషి చేసి దేశానికి కీర్తి తీసుకొచ్చిన పూడూరు గ్రామానికి చెందిన ఇటబోయిన గోపాల్ యాదవ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి విజయంలో భాగస్వామి కావడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ యువత క్రీడల్లో రాణిస్తూ దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. గోపాల్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజయాలు సాధించి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

Next Story