రాజధాని అభివృద్ధిపై అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం..

by Vemula.Srinu Prasad |

రాజధాని అభివృద్ధిపై అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని రైతు జేఏసీ(Farmers JAC) నిర్ణయించింది. త్వరలో అమరావతి(Amaravati)లోని 29 గ్రామాల ప్రతినిధులతో ఈ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీఆర్డీఏ అధికారుల(CRDA Officers) దగ్గరకు వెళ్తున్న నేపథ్యంలో రైతు జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అమరావతికి భూములిచ్చినా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదని రైతు జేఏసీ నేతలు తెలిపారు. అభివృద్ది కమిటీ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి తమ సమస్యలను వివరిస్తామని చెప్పారు. రాజధాని అభివృద్ధి అన్ని గ్రామాలకు సమానంగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘గతంలోనూ జేఏసీ ఏర్పాటు చేశారని, కానీ నిర్దిష్టమైన కమిటీ వివరాలు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తామే నాయకులమనే తీరు ఉంది. ప్రతి గ్రామం నుంచి అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.’’ అని రైతు జేఏసీ నేతలు తెలిపారు.

Next Story