ఎండు గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు

by velandi.Saikiran |

మత్తు పదార్థాల సరఫరాపై ఉక్కు పాదం మోపుతామని ములుగు డీసీఆర్బీ డీఎస్పీ ఈ. కిషోర్ కుమార్ అన్నారు.

ఎండు గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : వివిధ ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాల సరఫరాపై ఉక్కు పాదం మోపుతామని ములుగు డీసీఆర్బీ డీఎస్పీ ఈ. కిషోర్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన 33 లక్షల 50 వేల విలువైన 67.013 కిలోల ఎండు(డ్రై) గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై జిల్లా పోలీస్ శాఖ అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగపేట ఎస్సై టీవీకే సూరి, డీసీఆర్బీ ఎస్సై ఎన్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story