- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
సీఐటీయూ కార్యాలయంలో మూడు సంఘాల ఆధ్వర్యంలో మండల సంయుక్త సదస్సు నిర్వహించారు.

దిశ, హుజురాబాద్ రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం హుజురాబాద్‌లోని సీఐటీయూ కార్యాలయంలో మూడు సంఘాల ఆధ్వర్యంలో మండల సంయుక్త సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము ముఖ్య వక్తలుగా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వారు తీవ్రంగా ఖండించారు.
మూడో డిస్కం రద్దు..
రైతులకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ విద్యుత్ మూడో డిస్కం ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ విద్యుత్‌ను కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పెట్టే ఏ చర్యలనైనా రైతాంగం గట్టిగా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల న్యాయమైన హక్కులను రక్షించే నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వాటిని యథావిధిగా కొనసాగించాలని కోరారు. కార్మిక చట్టాలను బలహీనపరిచే చర్యలను నిలిపివేయాలన్నారు.
ఉపాధి హామీ పథకం పరిరక్షణ...
గ్రామీణ పేదలకు జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానన్ని యథాతథంగా కొనసాగించాలని, ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న వీబీజీ – రాంజీ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీని ప్రత్యామ్నాయ పథకాలతో నిర్వీర్యం చేయవద్దని హెచ్చరించారు.ప్రభుత్వాలు తమ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోకపోతే, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ సదస్సులో సీఐటీయూ మండల కన్వీనర్ కదిరే రమేష్, దండిగారి సతీష్, ఇమ్మడి దేవయ్య, కొడిమెల వెంకటేష్, ఆకునూరి సుధాకర్, శనిగరపు కొమురయ్య, నవీన్, శ్రీకాంత్, ఉమా, మాట్ల చిరంజీవి, మహేష్, లింగయ్య తదితర కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






