రాధా గాయత్రి మృతి కేసు .. 17 లోగా ఫిర్యాదులు, ఆధారాలివ్వాలని SDM ప్రకటన

by Naga Rani Yarlagadda |

టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతికేసులో ఇంకా ఆమె మరణానికి గల మిస్టరీ వీడలేదు.

రాధా గాయత్రి మృతి కేసు .. 17 లోగా ఫిర్యాదులు, ఆధారాలివ్వాలని SDM ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతికేసులో ఇంకా ఆమె మరణానికి గల మిస్టరీ వీడలేదు. భర్త శ్రీచరణ్ మీడియాకు, పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నాడు. అతని తల్లిదండ్రులు తమ కొడుకు లాయర్ తో సంప్రదిస్తున్నాడని పారిపోలేదని చెప్తున్నారు. మరోవైపు రాధా గాయత్రి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని ఆమె భర్త శ్రీచరణే పథకం ప్రకారం చంపేశాడని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ముస్సోరీ పోలీసులను, ఉత్తరాఖండ్ డీజీను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు.

కాగా.. తాజాగా ఈ కేసుపై విచారణ అధికారిగా ఉన్న రాహుల్ ఆనంద్ ఓ ప్రకటన విడుదల చేశారు. పెళ్లైన ఏడేళ్లలోపు ఏ మహిళైనా అనుమానాస్పద రీతిలో మరణిస్తే.. ఆ కేసు విచారణ చట్ట ప్రకారం మెజిస్ట్రేట్ స్థాయి అధికారి సమక్షంలో జరగాలి. అందుకే డెహ్రాడూన్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాధా గాయత్రి మృతి కేసులో ఈ నెల 17 లోపు ఫిర్యాదులు, కేసు వివరాలు లిఖితపూర్వంగా, మౌఖికంగా తెలపాలని కోరారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమె మృతికి గల కారణాలు వెల్లడి కాలేదని, అందుకే కేసును క్షుణ్ణంగా విచారించేందుకు ఫిర్యాదులు కోరుతున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా, ఎలాంటి ఆధారాలు ఉన్నా తనకు సమర్పించాలని స్పష్టం చేశారు.

Next Story