కళ్ళాపి పొడిలో అత్యంత ప్రమాదకర రసాయనాలు.. కంపెనీ సీజ్

by Ajay Maddhiboyina |

ఇంటి ముందు చల్లే కళ్లాపి పొడిలో అత్యంత ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా శ్రీ సౌభాగ్య కళ్లాపి పొడి అనే పేరుతో విక్రయిస్తుండగా, దానిని కలిపిన నీళ్లు తాగి 19మంది ఆత్మహత్య చేసుకున్నారు.

కళ్ళాపి పొడిలో అత్యంత ప్రమాదకర రసాయనాలు.. కంపెనీ సీజ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇంటి ముందు చల్లే కళ్లాపి పొడిలో అత్యంత ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా శ్రీ సౌభాగ్య కళ్లాపి పొడి అనే పేరుతో విక్రయిస్తుండగా, దానిని కలిపిన నీళ్లు తాగి 19మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాదిన్నరగా ఈ పొడి కలిపిన నీళ్లు తాగి 19మంది ఆత్యహత్య చేసుకోవడంతో పొడిలో ఏం ఉందో తెలుసుకునేందుకు అధికారులు తనిఖీలు చేపట్టారు. పొడిలోని రసాయన పధార్థాలను ప్రయోగాల ద్వారా గుర్తించగా అందులో.. "ఆరమైన–ఓష అనే రసాయనం వాడుతున్నట్టు గుర్తించారు.

ఈ పొడి పీల్చినా, చర్మంపై పడినా, కడుపులోకి ఇది చేరినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రొద్దుటూరులోని సదరు కంపెనీకి చెందిన ఐదు యూనిట్లను అధికారులు సీజ్ చేశారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కళ్లాపి పొడిని ప్రతిరోజు మహిళలు వినియోగిస్తుంటారు. పట్టణాలే కాకుండా పల్లెల్లో కూడా ఈ పొడి వినియోగిస్తున్నారు. దీంతో ఇలాంటి కపెంనీలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ఇలాంటి రసాయనాలు వినియోగించకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story