- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health Tips : కళ్లు దురదగా ఉన్నాయని చేతులతో రుద్దుతున్నారా..? బీ కేర్‌ఫుల్ !
కళ్లను రుద్దుతున్న సమయంలో మన చేతుల్లో ఉండే బ్యాక్టీరియా, ధూళి, అలర్జెన్స్ కళ్లలోకి చేరి ఇన్ఫెక్షన్ సోకుతుంది.

దిశ, ఫీచర్స్ : కళ్లు దురదగా లేదా అలసటగా అనిపిస్తున్నాయని చేతులతో రుద్దుతున్నారా? ఇది తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా దీర్ఘకాలంలో మాత్రం పెద్ద నష్టం కలిగిస్తుందని ఐ డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే.. అధ్యయనాల ప్రకారం.. తరచుగా లేదా బలంగా కళ్లు రుద్దడం వల్ల కళ్లపైన ఉండే పైపొర (కార్నియా)మీద ఒత్తిడి పడుతుంది. కాల క్రామేణా ఇది సన్నగా మారడం లేదా కళ్ల ఆకారం మారిపోయే కెరటోకోనస్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఇంకా ప్రమాదం ఏమిటంటే.. కళ్లను రుద్దుతున్న సమయంలో మన చేతుల్లో ఉండే బ్యాక్టీరియా, ధూళి, అలర్జెన్స్ కళ్లలోకి చేరి ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీంతో కళ్లు ఎర్రబడడం, వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నేత్ర వైద్యులు చెబుతున్నారు. అందుకే కళ్లు దురదగా లేదా పొడిబారినప్పుడు రుద్దకుండా ఉండటం, సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అనుసరించడం ఉత్తమం అంటున్నారు. లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వేసుకోవడం, చల్లని నీటి కంప్రెస్ పెట్టుకోవడం, అలర్జీలు ఉంటే వాటికి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. అలాగే కళ్లు నిరంతరం ఎర్రబడడం, నొప్పిగా అనిపించడం, మసకబారిన చూపు లేదా అసౌకర్యం ఉంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేత్ర వైద్యులను సంప్రదించడాలని నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ఇది వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించండి.






