పొన్నెకల్లు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

by Taduka Kalyani |

ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు గ్రామ శివారులో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

పొన్నెకల్లు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు గ్రామ శివారులో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లంపాడు నుంచి ఖమ్మం వైపు ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్నారు. పొన్నెకల్లు గ్రామ పరిసర ప్రాంతానికి చేరుకోగానే బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుడిని గాయపడిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story