దిశ ఎఫెక్ట్..రంగంలోకి స్వ‌యంగా సీఐ విశ్వేశ్వర్

by velandi.Saikiran |

ఊకల్ క్రాస్ మృత్యు కూడలిగా మారింది అంటూ దిశ పేపర్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.

దిశ ఎఫెక్ట్..రంగంలోకి స్వ‌యంగా సీఐ విశ్వేశ్వర్
X

దిశ, గీసుకొండ : ఊకల్ క్రాస్ మృత్యు కూడలిగా మారింది అంటూ దిశ పేపర్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ విషయంపై గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని గడ్డ పలుగుతో స్వయంగా తొలగించారు. ఈ సందర్భంగా సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ ఇలా మట్టి రోడ్డుపైకి వస్తే సహించేది లేదని హెచ్చ‌రించారు. దీనివల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. రోడ్డుపై అక్రమంగా పార్కింగ్ చేసే లారీ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని ఏకశిలా లారీ ఫెర్టిలైజర్ అసోసియేషన్ సభ్యులను హెచ్చరించారు. ఈ క్ర‌మంలో స్థానికులు, వాహనదారులు సీఐ విశ్వేశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story