గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై ఆరా తీసిన ఎమ్మెల్యే, ఎంపీ

by velandi.Saikiran |   (  Updated:2026-07-09 10:13:10  IST  )

మన్ననూరు గ్రామంలో పివీటిజీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై ఆరా తీసిన ఎమ్మెల్యే, ఎంపీ
X

దిశ, అచ్చంపేట : మన్ననూరు గ్రామంలో పివీటిజీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎంపీ డాక్టర్ మల్లు రవి చికిత్స పొందుతున్న విద్యార్థులతో వీడియో కాల్ ద్వారా అడిగి ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచనలు చేశారు. ఫుడ్ పాయిజన్ గల కారణాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Next Story