- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్న రావణ్ ఇష్యూపై స్పందించిన సీఎం చంద్రబాబు.. అలాంటి వ్యక్తికి మద్దతా?
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ప్రశ్న రావణ్ ఇష్యూపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ప్రశ్న రావణ్ ఇష్యూపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడని, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ లకు అతను మద్దతు తెలిపాడన్నారు. అలాంటి వ్యక్తికి మద్దతు తెలిపి.. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేశారని దుయ్యబట్టారు. ఆనాడు వివేకాను కూడా హత్య చేసి.. నారాసుర రక్తచరిత్ర అని విష ప్రచారం చేశారని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు రావణ్ ను అడ్డం పెట్టుకుని మత విద్వేషాలను రెచ్చగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో కులాలు, మతాలను విభజించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసను ప్రోత్సహించే ప్రవర్తన సరికాదని, వైసీపీ తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు.
రాయలసీమలో వాళ్లు రక్త చరిత్ర రాస్తే.. తాము రతనాల సీమగా మార్చి కొత్త చరిత్రను రాయబోతున్నామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉండాలని, దేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్ గా మారాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం సమస్యలు, సంక్షేమంపై ఆలోచిస్తుంటే.. గొడ్డలిపార్టీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, గతంలో మత కలహాలను అణచివేసిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేసిన చరిత్ర టీడీపీకి ఉంటే.. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపిన చరిత్ర వైసీపీది అని విమర్శించారు. 2019-24 మధ్య రాష్ట్రమంతా వైసీపీ హయాంలో డ్రగ్స్, గంజాయి ఏరులై పారిందని, రౌడీలు, గంజాయి బ్యాచ్ లను వైసీపీ ప్రోత్సహిస్తోందన్నారు. 2019 లో ఎన్నో ఆలయాలపై దాడులు జరిగితే.. ఆనాటి ప్రభుత్వం ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.






