- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరుబాబీ2 ప్రాజెక్టుపై టీమ్ క్లారిటీ.. ఆ వార్తలన్ని ఫేక్ అంటూ ట్వీట్
చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్టు ముహూర్తం, షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చారు టీమ్.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మూవీ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయినట్లు, నటీనటుల విషయంలో ఊహాగాణాలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించబోయే కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతగా తప్పుకుందని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. నెట్టింట ప్రచారం అవుతున్న వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు చిత్ర బృందం. ‘మెగా158, చిరుబాబీ2 చిత్రాలకు సంబంధించి వస్తున్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవి. దయచేసి అటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మడం గానీ, వ్యాప్తి చేయడం గానీ చేయవద్దు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పూర్తిగా కట్టుబడి ఉంది. అలాగే దానిని ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముహూర్తం, రెగ్యులర్ షూట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు అతి త్వరలో ప్రకటించబడతాయి. వేచి ఉండండి’ అంటూ ప్రకటించారు.






