చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన సినిమా ఆగిపోవడంపై కీలక వ్యాఖ్యలు చేసిన జేడీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-27 16:40:24  IST  )

తాను దర్శకత్వం వహించిన మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ చిత్ర ప్రారంభోత్సవానికి చిరంజీవి గారు హాజరయ్యారని, అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని జేడీ చక్రవర్తి తెలిపారు.

చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన సినిమా ఆగిపోవడంపై కీలక వ్యాఖ్యలు చేసిన జేడీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీని మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఆయన ఈ సినిమా ప్రమోషన్ల నిమిత్తం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చిరంజీవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ… చిరంజీవి గారు అంటే నాకు ఎంతో అభిమానం.

ఆయన సినిమాలు, బయట వ్యక్తిత్వం నాకు ఎంతో ఇష్టం. ఆయనతో నటించాలి అనే కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. ఒకానొక సమయంలో ఆయనతో నటించే అవకాశం చాలా దగ్గరగా వచ్చి చేజారిపోయింది. ఇక కొన్ని సంవత్సరాల క్రితం నేను దర్శకత్వం వహించిన మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ చిత్ర ప్రారంభానికి ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఆ సినిమా 80 శాతం వరకు షూటింగ్ పూర్తయ్యాక కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆయనతో నటించాలి అనే కోరిక ఇప్పటికీ బలంగానే ఉంది.

భవిష్యత్తులో ఆయనతో తప్పకుండా నటిస్తానని నాకు అనిపిస్తుంది. అందుకే ప్రకృతి ఈ చిన్న చిన్న ప్రాజెక్టులను పక్కన పెడుతుంది. ఆయనతో ఒక మహా సినిమాలో నేను భాగం అవుతానని నాకు అనిపిస్తోందని జేడీ చక్రవర్తి తాజాగా చెప్పుకొచ్చాడు. ఇక ఆయన తాజాగా నటించిన ‘గాయపడ్డ సింహం’ మూవీ మంచి విజయం సాధించినట్లయితే ఆయనకు మళ్లీ వరుస అవకాశాలు దక్కే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చిరుబాబీ2 ప్రాజెక్టుపై టీమ్ క్లారిటీ.. ఆ వార్తలన్ని ఫేక్ అంటూ ట్వీట్

Next Story