జలాశయంలో ప్రమాదం.. మత్స్యకార కుటుంబంలో విషాదం

by Vemula.Srinu Prasad |

మత్స్యకార కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చేపలవేటకు వెళ్లిన మత్య్సకారుడు గణేశ్ మృతి చెందారు. రోజుమాదిరిగానే గణేశ్ విజయనగరం జిల్లా మడ్డువలస ప్రాజెక్టులోకి చేపల వేటకు వెళ్లారు...

జలాశయంలో  ప్రమాదం.. మత్స్యకార కుటుంబంలో విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: మత్స్యకార కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చేపలవేటకు వెళ్లిన మత్య్సకారుడు గణేశ్ మృతి చెందారు. రోజుమాదిరిగానే గణేశ్ విజయనగరం జిల్లా మడ్డువలస ప్రాజెక్టులోకి చేపల వేటకు వెళ్లారు. కొన్ని చేపల వేట అనంతరం మళ్లీ పట్టేందుకు ప్రాజెక్టులో వల విసిరారు. అయితే ప్రమాదవశాత్తు జారీ ప్రాజెక్టులో ఆయన పడిపోయారు. ఈత ద్వారా బయటకు రావాలని ప్రయత్నం చేశారు. కానీ లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక కొద్దిసేపటికే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వల సాయంతో గణేశ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోస్టుమార్టంకు తరలించారు. మరోవైపు గణేశ్ మృతితో స్థానిక మత్య్సకారులు విషాదంలో మునిగిపోయారు. గణేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story