- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs AFG: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ, రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
లక్నో వన్డేలో అఫ్గానిస్తాన్‌పై భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: లక్నోలోని ఏకానా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ (India), అఫ్గానిస్తాన్ (Afghanistan) జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ భారీ స్కోరు దిశగా వెళ్తోంది. ప్రస్తుతం టీమిండియా 22.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న ఆటగాళ్లు ఓవర్‌కు 7.18 పరుగుల వేగంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.
హిట్ మ్యాన్ నయా రికార్డు..
ఇన్నింగ్స్ ప్రారంభంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashwi Jaiswal) కేవలం 4 పరుగులకే మహ్మద్ సలీమ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)తో జతకట్టిన సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 39 బంతుల్లో 48 పరుగులు చేసి మంచి చక్కని ఫామ్‌లో కనిపించాడు. తాజా ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ శర్మ తన లిస్ట్-ఎ క్రికెట్ కెరీర్‌లో 14 వేల పరుగుల అరుదైన మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ తర్వాత అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన వేసిన గూగ్లీకి రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం అతడు 57 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 74 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 36 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. వీరిద్దరి మధ్య భాగస్వామ్యం బలంగా మారుతుండటంతో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో రషీద్, మహ్మద్ సలీమ్ చెరో వికెట్ తీసుకున్నారు.






