- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ నిర్మాత కూతురికి పెళ్లి సెట్ చేసిన తారక్
నిర్మాత అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్, తన ప్రేమ వివాహం జరగడంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారని వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సహాయస్వభావంతో ఉంటారని పలువురు చెబుతుంటారు. ఆయన మంచి మనసుకు నిదర్శనంగా నిలిచే ఓ ఆసక్తికర సంఘటన గురించి తెలుసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన అశ్విని దత్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో స్వప్న దత్ ఒకరు. ఆమె 2010లో ప్రసాద్ వర్మను ప్రేమ వివాహం చేసుకుంది.
అయితే ఈ పెళ్లి జరగడంలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించినట్లు స్వప్న దత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్వప్న దత్ మాట్లాడుతూ.. నేను ప్రసాద్ వర్మను ప్రేమిస్తున్న సమయంలో ఆ విషయం ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్‌లో ఉండగా ఆయనను కలిసి మొత్తం విషయం చెప్పాను. ప్రేమ వ్యవహారాలను ఎక్కువ కాలం దాచకుండా తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకోవడం మంచిదని తారక్ తనకు సలహా ఇచ్చాడు.
అయితే తమ తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకుంటారనే నమ్మకం తనకు లేదని చెప్పగా, తారక్ తానే మాట్లాడి ఒప్పిస్తానని హామీ ఇచ్చి సినిమా షూటింగ్ మధ్యలోనే వెళ్లి తన తండ్రి అశ్విని దత్‌కు ప్రేమ విషయం మొత్తం వివరించి, పెళ్లికి ఒప్పించినట్లు ఆమె చెప్పారు. తారక్ మాట్లాడిన విధానం వల్లే తమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించారని, ప్రస్తుతం తాను ఎంతో సంతోషకరమైన దాంపత్య జీవితం గడుపుతున్నానని స్వప్న దత్ పేర్కొన్నారు. తన ఆనందానికి ప్రధాన కారణం తారక్ అని ఆమె చెప్పుకొచ్చారు.






