- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంత్ నీల్ చేసిన పనికి డిసప్పాయింట్ అయిన ప్రేక్షకులు
ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ చిత్రాన్ని కూడా ‘కెజియఫ్ ’, ‘సలార్’ సినిమాల మాదిరిగానే డార్క్ షేడ్స్, బ్లాక్-గ్రే కలర్ టోన్‌లో తెరకెక్కిస్తున్నట్లు తాజా గ్లింప్స్ వీడియోను బట్టి తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. యష్ హీరోగా తెరకెక్కిన ‘కెజియఫ్ ’ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు పొందారు. ఈ చిత్రం ప్రధానంగా డార్క్ షేడ్స్, బ్లాక్-గ్రే కలర్ టోన్‌లో తెరకెక్కింది. అప్పటివరకు భారతీయ సినిమాల్లో ఇలాంటి విజువల్ ప్రెజెంటేషన్ ఎక్కువగా కనిపించకపోవడంతో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ఆయన రూపొందించిన ‘సలార్’ చిత్రం కూడా కథ, యాక్షన్ అంశాల పరంగా మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, విజువల్‌గా ‘కేజీఎఫ్’ తరహాలోనే బ్లాక్-గ్రే టోన్‌లో కనిపించింది.
దీంతో ప్రశాంత్ నీల్ తన చిత్రాల విషయంలో కొంత మార్పు తీసుకురావాలని కొందరు విమర్శలు కూడా చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘సలార్’ తర్వాత వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈసారి ఆయన పూర్తిగా భిన్నంగా మరింత కలర్‌ఫుల్ విజువల్స్‌తో సినిమా రూపొందిస్తున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది.
అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ వీడియోను గమనిస్తే ఈ చిత్రం కూడా బ్లాక్-గ్రే కలర్ టోన్‌లోనే సాగనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ తన స్టైల్‌లో పెద్దగా మార్పు చేయలేదని 'కెజియఫ్', 'సలార్' చిత్రాల తరహాలోనే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే సినిమా విజువల్ టోన్ ఎలా ఉన్నా కథ మరియు కథనం బలంగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంచి కంటెంట్ ఉంటే సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని వారు చెబుతున్నారు.






