- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడు ఎన్నికల షెడ్యూల్.. త్రిష బర్త్ డేపై ట్రోల్స్ !
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజునే త్రిష బర్త్ డే ఉన్న నేపథ్యంలో ట్రోల్స్ మొదలయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఐదు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అస్సాంతో పాటు పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా తాజాగా రిలీజ్ అయింది. ముఖ్యంగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23వ తేదీన జరగనున్నాయి. మే 4వ తేదీన అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. అదే రోజున తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలనుంది.
త్రిష బర్త్ డే పై పోస్టులు
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో హీరోయిన్ త్రిష పుట్టిన రోజుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన రిలీజ్ కానున్నాయి. అదే రోజున త్రిష పుట్టిన రోజు కూడా ఉంటుంది. అయితే రిజల్ట్ రోజు విజయ్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేస్తే, త్రిషకు మంచి ట్రీట్ దక్కుతుందని కొంత మంది పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతాయని అంటున్నారు. అదృష్టం బాగుంటే, విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
ఒకవేళ కొత్తగా పెట్టిన విజయ్ పార్టీ దారుణమైన ప్రదర్శన కనబరిస్తే, పరిస్థితి మరోలాగా ఉంటుందని ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో మార్చి 4వ తేదీ హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో హీరో విజయ్, సంగీతాల విడాకుల కేసు విచారణ ఏప్రిల్ 20వ తేదీన ఉండనుంది. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఇలా విజయ్ కి ఎన్నికల తేదీలు పెను సవాల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా త్రిషతో విజయ్ కి రిలేషన్ ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి త్వరలోనే త్రిషాను పెళ్లి చేసుకోవాలని విజయ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
విజయ్ వర్సెస్ పవన్.. ఉస్తాద్ ఈవెంట్‌లో మొదలైన అసలైన పొలిటికల్ వార్!






