శృంగార శబ్దాలున్న వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసిన నుస్రత్.. అసలు నిజం ఇదేనంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-04 10:08:16  IST  )

జనాలు తమ పిచ్చి ఆలోచనలను కాస్త ఆపితే మంచిది! చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నంత మాత్రాన ఇతరులను వేధించే హక్కు మీకు రాదు.

శృంగార శబ్దాలున్న వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసిన నుస్రత్.. అసలు నిజం ఇదేనంటూ పోస్ట్
X

దిశ, సినిమా: గత రెండు రోజులుగా బాలీవుడ్ హాట్ బ్యూటీ నుస్రత్ భరుచా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ పెట్టిన ఓ పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో విరాట్ కోహ్లీకి చెందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని గెలుచుకోగా.. ఈ ఆనందంలో నుష్రత్ భరుచా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. అయితే, ఆ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో శృంగార శబ్దాలు వినిపించడంతో, ఇంటర్నెట్‌లో రకరకాల పుకార్లు, తప్పుడు వార్తలు మొదలయ్యాయి. ఆ సమయంలో నుస్రత్ శృంగారంలో పాల్గొంటుందేమోనని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ పోస్టులు కాస్త వైరల్ కావడంతో అది చూసిన నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అసలు ఇలాంటి వీడియోను షేర్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. మొత్తానికి ఒక్క వీడియో ఆమె సోషల్ మీడియాను షేక్ చేసిందని చెప్పాలి. ఎక్కడ చూసినా అదే చర్చ నడుస్తోంది. నుస్రత్ పోస్ట్ క్రికెట్ అభిమానుల్లో, సినీ వర్గాల్లో కలకం రేపింది. ఈక్రమంలో.. తాజాగా, ఈ వివాదంపై నుష్రత్ భరుచా స్పందిస్తూ.. వివరణ ఇచ్చింది. అలాగే తన పేరుతో ప్రచారంలో ఉన్న ఫేక్ స్టేట్‌మెంట్‌ను కూడా ఆమె తీవ్రంగా ఖండించింది. తాను మ్యాచ్ చూసిన లివింగ్ రూమ్, టీవీ ఫోటోలను షేర్ చేస్తూ.. "కొంతమంది మరీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఒక చిన్న కుక్క పిల్ల (పప్పీ) ఏడ్చిన శబ్దానికి ఇంత రచ్చ సృష్టించాలా? పైగా నా తరపున ఎవరో ఒక ఫేక్ క్లారిఫికేషన్ స్టేట్‌మెంట్‌ను కూడా క్రియేట్ చేసి వైరల్ చేశారు. అసలు నిజం ఏంటంటే.. నేను నా స్నేహితుల ఇంట్లో మ్యాచ్ చూశాను.

అక్కడ ఉన్న ఒక చిన్న కుక్క పిల్ల ఆ సమయంలో అలా ఏడుస్తూ శబ్దాలు చేసింది. అదే సమయంలో నా ఫ్రెండ్ మరో యాంగిల్ నుండి తీసిన వీడియో ఇది, ఇందులోనూ అదే సౌండ్స్ ఉన్నాయి చూడండి" అంటూ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత మరో పోస్ట్‌లో ఆ కుక్క పిల్లకు సంబంధించిన మరికొన్ని విజువల్స్ షేర్ చేస్తూ నెటిజన్లపై నుష్రత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఇదే నేను మ్యాచ్ చూసిన ఇల్లు.. ఇదిగో ఇదే ఆ కుక్క పిల్ల. ఆ రాత్రి మ్యాచ్ ముగిసిన కాసేపటికి తీసిన వీడియో ఇది. సరిగ్గా ఇప్పుడు జరుగుతున్న రచ్చ గురించే భయపడి, నన్ను ఆ వీడియో డిలీట్ చేయమని కొందరు సలహా ఇచ్చారు.. అందుకే నేను డిలీట్ చేశాను. జనాలు తమ పిచ్చి ఆలోచనలను కాస్త ఆపితే మంచిది! చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నంత మాత్రాన ఇతరులను వేధించే హక్కు మీకు రాదు. ఏదైనా గుడ్డిగా నమ్మేసి తప్పుగా అర్థం చేసుకోకండి. కాస్త బాధ్యతగా ఆలోచించి ప్రవర్తించండి" అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది

Next Story