- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం పర్యటన.. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు గృహనిర్బంధం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్వాల నియోజకవర్గంలోని ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా గురువారం బీఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడుతో పాటు ఇతర నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

దిశ, జోగులాంబ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్వాల నియోజకవర్గంలోని ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా గురువారం బీఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడుతో పాటు ఇతర నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో పోలీసులు ఆయన నివాసానికి చేరుకుని నిర్బంధించారని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బాసు హనుమంతు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌ను కూడా పోలీసులు నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న సమయంలో ప్రతిపక్ష నాయకుల పై ఆంక్షలు విధించడం, పోలీసు నిర్బంధాలకు పాల్పడటం సరైన పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ నాయకులను గృహనిర్బంధం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. మూడు సంవత్సరాల పాలనకే ప్రభుత్వం ఇంత అభద్రతాభావానికి గురవుతోందా అని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, ప్రజా సమస్యల పై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాము స్పందిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీగా వస్తున్నప్పటికీ గద్వాలలో సీఎం పర్యటనకు సంబంధించిన ప్రత్యేక వాతావరణం ఎక్కడా కనిపించడం లేదని ఆయన విమర్శించారు.






