షాకింగ్ ట్విస్ట్‌తో మరోసారి వాయిదా పడిన ‘టాక్సిక్’.. విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

by Mallepaka Hamsa |

అయితే నేడు సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా, ఎలాంటి ప్రమోషన్స్ కానీ, అప్‌డేట్స్ కానీ లేకపోవడంతో సోషల్ మీడియాలో పలు రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

షాకింగ్ ట్విస్ట్‌తో మరోసారి వాయిదా పడిన ‘టాక్సిక్’.. విడుదల ఇప్పట్లో లేనట్టేనా?
X

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రుక్మిని వసంత్, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి కీలక పాత్రలో కనిపించనున్నారు. డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ఇందులోంచి వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇక ముందుగా మార్చిలో విడుదల చేయాలనుకున్న మేకర్స్ పలు కారణాల వల్ల జూన్ 4న వాయిదా వేశారు. నిజానికి ఈ సినిమాను జూన్ 4న (నేడే) విడుదల చేయాలని మేకర్స్ గతంలో ప్రకటించారు.

అయితే నేడు సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా, ఎలాంటి ప్రమోషన్స్ కానీ, అప్‌డేట్స్ కానీ లేకపోవడంతో సోషల్ మీడియాలో పలు రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ షాకింగ్ ట్విస్ట్ వచ్చి పడింది. అయితే కొన్ని సీన్స్ విషయంలో హీరో యష్ అసంతృప్తిగా ఉన్నారని.. అందుకే ఏకంగా 100 రోజుల పాటు కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు విదేశీ పంపిణీ పరంగా కొన్ని సమస్యలు తలెత్తడం కూడా వాయిదాకు కారణమని అంటున్నారు. ఈ కారణాల వల్లే సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, నేడు థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇలా వాయిదా పడటం.. రీషూట్ వార్తలు రావడం చూసి యష్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిజంగానే ఇప్పట్లో విడుదల చేయరేమో అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story