- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Meena: ఆ సినిమా చేయలేకపోయా.. ఇప్పటికీ బాధగా ఉంది
‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో నటించే అవకాశం మిస్ అయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని మీనా తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన మీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తన సినీ ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమెకు, “మీ సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలను వదులుకుని ఉంటారు. వాటిలో ఏదైనా చిత్రం మిస్ అయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నారా?” అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా మీనా మాట్లాడుతూ, “నేను ఇప్పటివరకు చాలా సినిమాలను వదులుకున్నాను. అందులో కొన్ని మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అయితే నేను ఒక సినిమాలో భాగం కాలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను.
అదే ‘నిన్నే పెళ్లాడతా’. నాగార్జున హీరోగా రూపొందిన ఈ సినిమా కోసం మొదట దర్శకుడు కృష్ణవంశీ నన్ను హీరోయిన్ పాత్రకు సంప్రదించారు. కానీ ఆ సమయంలో నేను ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాను. ఆ రోజుల్లో సినిమాలను తక్కువ సమయంలో పూర్తి చేసేవారు. అయితే ‘నిన్నే పెళ్లాడతా’ కోసం కృష్ణవంశీ ఎక్కువ డేట్స్ అడిగారు. 15 లేదా 20 రోజులు అడిగి ఉంటే ఏదోలా అడ్జస్ట్ చేసేదాన్ని. కానీ దాదాపు 50 రోజుల వరకు డేట్స్ కావాలని చెప్పడంతో నిస్సహాయ స్థితిలో ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాలో నటించలేకపోయినందుకు బాధపడుతుంటాను” అని మీనా చెప్పుకొచ్చింది.






