Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్ షఫాలీ మృతిపై అనుమానాలు.. ముంబాయి పోలీసుల కీలక అప్డేట్

by Ramesh Naini |   (  Updated:2025-06-28 09:23:07  IST  )

బాలీవుడ్ నటి, ‘కాంటా లగా’ సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా (42) మృతి చెందడం అభినానులకు షాకింగ్‌కు గురిచేసింది.

Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్ షఫాలీ మృతిపై అనుమానాలు.. ముంబాయి పోలీసుల కీలక అప్డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ నటి, ‘కాంటా లగా’ (Kaanta Laga) సాంగ్ ఫేమ్ (Shefali Jariwala) షఫాలీ జరివాలా (42) మృతి చెందడం అభినానులకు షాకింగ్‌కు గురిచేసింది. ప్రముఖ నటులు ఆమె మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురై షఫాలీ జరివాలా కన్నుమూసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై తాజాగా (Mumbai Police) ముంబాయి పోలీసులు కీలక అప్డేట్ ఇచ్చారు. షఫాలీ మృతికి గల కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు. ఇంకా ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించినట్లు ముంబాయి పోలీసులు శనివారం తెలిపారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. షఫాలీ జరివాలాను ఆమె భర్త నటుడు పరాగ్ త్యాగి (Parag Tyagi), మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు దీని గురించి తెల్లవారుజామున 1 గంటలకు సమాచారం అందింది. బెల్లేవ్ ఆసుపత్రి రిసెప్షన్ సిబ్బంది ప్రకారం, షఫాలిని ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి ఆమె మరణించింది. అయితే, నటి అంధేరిలోని ఆమె నివాసంలో ఉంటుంది, ఆమె మరణానికి గల కారణం ఇంకా అస్పష్టంగా ఉందని ముంబాయి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె అపార్ట్‌మెంట్‌ను ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ కేసును అనుమానాస్పద ఘటనగానే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె భర్త పరాగ్ త్యాగి వాంగ్మూలాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.

కాగా, షఫాలీ అస్వస్థతకు గురవ్వడంతో శుక్రవారం అర్ధరాత్రి హుటాహుటిన భర్త ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే కుటుంబ సభ్యులు మాత్రం దాన్ని ధృవీకరించలేదు. 2002లో ‘కాంటా లగా’ రిమిక్స్ సాంగ్‌‌తో షఫాలీ జరివాలా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి ఆమెను కాంటా లగా గర్ల్ అని పిలిచేవారు. బాలివుడ్‌కు ఎన్నో హిట్ పాటలు అందించారు. నటుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా చేసి ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. రియాల్ నటించి, హిందీ బిగ్‌బాస్ 13లోకి కూమా ఎంట్రీ ఇచ్చారు. 2004లో షఫాలీ మ్యూజీషియన్ హర్మీత్ సింగ్‌ను పెళ్లి చేసుకోని.. 2009లో విడాకులు తీసుకున్నారు. ఆమె 2015లో పరాగ్ త్యాగిని వివాహం చేసుకున్నారు.

Read More..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం... గుండెపోటుతో నటి మృతి !

Next Story