‘కరుప్పు’తో కెరీర్ హయ్యెస్ట్ టచ్ చేసిన సూర్య.. వేసవి దాహం తీర్చాడు

by Pulgam srinivas |   (  Updated:2026-05-22 07:23:20  IST  )

ఇప్పటివరకు కరుప్పు సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 207 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

‘కరుప్పు’తో కెరీర్ హయ్యెస్ట్ టచ్ చేసిన సూర్య.. వేసవి దాహం తీర్చాడు
X

దిశ, వెబ్ డెస్క్: తన వైవిధ్యమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సూర్య తాజాగా ‘కరుప్పు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. మొదట ఈ సినిమాను మే 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆ రోజు షోలు ప్రదర్శించబడలేదు. అనంతరం మే 15న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

రెండు భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 207 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక సూర్య కెరియర్లో ఈ సినిమా హైయెస్ట్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా వరుస అపజయాలతో కెరీర్‌ను కొనసాగిస్తున్న సూర్యకు, ‘కరుప్పు’ విజయం కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మెగా 158: దర్శకుడి మాటలతో పెరిగిన అంచనాలు

Next Story