మెగా 158: దర్శకుడి మాటలతో పెరిగిన అంచనాలు

by Pulgam srinivas |   (  Updated:2026-05-22 07:24:06  IST  )

మెగా 158 చిత్రంలో వింటేజ్ అభిమానులను మెప్పించే అంశాలతో పాటు, న్యూ ఏజ్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయని దర్శకుడు బాబీ తెలిపారు.

మెగా 158: దర్శకుడి మాటలతో పెరిగిన అంచనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: చిరంజీవి - బాబీ కొల్లి కాంబినేషన్‌లో ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో నిన్న పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్‌తో పాటు మరికొంత మంది సినీ సెలబ్రిటీలు కూడా విచ్చేశారు. ఇక తాజాగా ‘మెగా 158’ సినిమాపై దర్శకుడు బాబీ కొల్లి భావోద్వేగపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అభిమానుల ప్రేమ, ఉత్సాహం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. “ఈరోజు ఫ్యాన్స్ తనపై చూపించిన లవ్, ఎనర్జీ ఎంతో గొప్పగా అనిపించింది. వారు చూపించిన ప్రతి గొప్ప అనుభవాన్ని నేను కూడా ఫీల్ అయ్యాను.

ఆ ప్రేమతో బాధ్యత కూడా మరింత పెరిగింది. ‘మెగా 158’ చిత్రాన్ని ఒక స్పష్టమైన లక్ష్యంతో రూపొందిస్తున్నామని, మెగాస్టార్‌ను అభిమానులు ఎలా సెలబ్రేట్ చేస్తారో, అలాగే తరతరాలుగా గొప్ప నటుడిగా అభిమానించే చిరంజీవిని మరో కోణంలో చూపించేలా సినిమా ఉండబోతుందని ఈ దర్శకుడు హామీ ఇచ్చారు. వింటేజ్ అభిమానులను మెప్పించే అంశాలతో పాటు, న్యూ ఏజ్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయని బాబీ తెలిపారు. చివరగా “హిస్ ర్యాంపేజ్‌కు సిద్ధంగా ఉండండి” అంటూ అభిమానుల్లో మరింత హైప్ పెంచారు. తాజాగా ఈ దర్శకుడు చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

‘కరుప్పు’తో కెరీర్ హయ్యెస్ట్ టచ్ చేసిన సూర్య.. వేసవి దాహం తీర్చాడు

Next Story