- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan Creative Works : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ప్రత్యేకమైన వీడియో విడుదల
అజ్ఞాతవాసి సినిమా చూసిన అందరికీ ‘వీడి చర్యలు ఊహాతీతం వర్మ’ అనే డైలాగ్ గుర్తుడే ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: అజ్ఞాతవాసి సినిమా చూసిన అందరికీ ‘వీడి చర్యలు ఊహాతీతం వర్మ’ అనే డైలాగ్ గుర్తుండే ఉంటుంది. అచ్చం ఇలాగే బయట కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్యలను ఎవరూ ఊహించలేరు. తాజాగా పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. దీనికి సంబంధిచి ఓ స్పెషల్ మీడియోను స్వయంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. అయితే ఈ వీడియోలో కూడా స్పష్టత ఇవ్వకుండా ఫ్యాన్స్‌ను పవన్ కన్‌ఫ్యూజ్ చేశారు. జపనీస్ థీమ్, మార్షల్ ఆర్ట్స్ అంశాలతో రూపకల్పన చేసిన వీడియో చూసిన ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది. అంతేకాదు.. వీడియోలో చివరకి పవన్ కల్యాణ్ గాలిలోకి ఎగిరి కిక్ ఇవ్వడం వంటి సన్నివేశం చూపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఇది ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను కూడా సృష్టించింది. అయితే.. మళ్లీ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మించబోతున్నారా? లేక మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది. గతేడాది ‘OG’ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సమ్మర్‌లో హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అదనంగా, రామ్ తాళ్లూరి నిర్మించిన, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.






