Poonam Kaur: హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని భార్యను చిత్రహింసలు పెట్టాడు.. డైరెక్టర్ బండారం బయటపెట్టిన పూనమ్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-07 05:29:35  IST  )

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur)మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది.

Poonam Kaur: హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని భార్యను చిత్రహింసలు పెట్టాడు.. డైరెక్టర్ బండారం బయటపెట్టిన పూనమ్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur)మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారే పూనమ్.. చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చకు తెరలేపాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి. ఓ డైరెక్టర్ నిజస్వరూపం బయటపెట్టడంతో అంతా షాక్ అవుతున్నారు. ‘‘ఓ డైరెక్టర్, ఓ హీరోయిన్ కోసం తన భార్యను చిత్రహింసలకు గురి చేశాడు.

అతడు కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే జరిగింది. ఆ ఇల్లాలిని ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలుసు. అన్యాయం జరిగినా ఆ మహిళ మాత్నం బయటకు రాలేదు. తనకు జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పలేదు. తన భర్తను బుట్టలో వేసుకున్న హీరోయిన్ సినిమా ఈవెంట్లకు కూడా హాజరైంది. ఈ విషయం తెలుసుకుని నేను చాలా షాకయ్యాను. మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నాను’’ అని చెప్పింది. అయితే ఆ డైరెక్టర్ పేరు మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం పూనమ్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అతను ఎవరా? అనే చర్చ కొనసాగుతోంది.

Read More..

Poonam Kaur: నా న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని బెదిరించారు !

Next Story