- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ కు షాక్...ఆ మూవీ ఛాన్స్ కొట్టేసిన రవితేజ ?
పవన్ కళ్యాణ్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ మాస్ సినిమా చేయాలని చాలా రోజుల నుంచి కథ రాసుకున్నారట

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఛాన్స్ ఉన్నప్పుడల్లా షూటింగ్ లో పాల్గొని మళ్లీ అమరావతిలో డ్యూటీ చేస్తున్నాడు. చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఇంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఓ క్రేజీ ప్రాజెక్టు చేజేతులా పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ మాస్ సినిమా చేయాలని చాలా రోజుల నుంచి కథ రాసుకున్నారట. ఈ కథ పవన్ కళ్యాణ్ కు కూడా బాగా నచ్చిందట. దీంతో ఈ మూవీ పట్టాలెక్కే చివరి క్షణంలో ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఈ సినిమాను వదిలేశారట పవన్ కళ్యాణ్. దీంతో ఈ ప్రాజెక్ట్ ను రవితేజతో చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట.
Read More... సుజిత్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. బండ్ల గణేష్ షాకింగ్ రియాక్షన్!






