- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుజిత్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. బండ్ల గణేష్ షాకింగ్ రియాక్షన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన ‘ఓజీ’ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాకుండా ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌కు సక్సెస్ అందించడంతో ఆయన డైరెక్టర్ సుజిత్(Sujith)కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఖరీదైన కారు కొనుగోలు చేసి ఇచ్చి ఆయనతో కొంత సమయాన్ని గడిపారు. ఈ విషయాన్ని సుజిత్ సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అంతా పవన్ కళ్యాణ్ గొప్ప మనసును పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
తాజాగా, ఈ విషయంపై బండ్ల గణేష్ (Bandla Ganesh)షాకింగ్ పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచారు. ‘‘కంగ్రాట్యులేషన్స్.. మీకు వారు కారు ఇచ్చారు. నాకు జీవితమే ఇచ్చారు’’ అనే క్యాప్షన్ జత చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్‌కు దూరం అయిన ఆయన ఇలాంటి పోస్ట్ పెట్టడంతో పవన్ అభిమానులు మళ్లీ కలిసిపోయారా? అని కామెంట్లు పెడుతున్నారు. కాగా.. పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్‌కు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పవర్ స్టార్‌ని ఏకంగా దేవుడితో పోలుస్తుంటారు. ఏదైనా ఈవెంట్‌కు వెళ్లినా ఆయన గురించే మాట్లాడుతుంటారు. గతంలో ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్న బండ్ల గణేష్ గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్‌ను కలిసింది లేదు? ఎక్కడైనా ఈవెంట్లలో పాల్గొన్నా.. ఆయన గురించి మాట్లాడటం కూడా మానేశారు.
ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ బండ్ల గణేష్ ఎక్కడా ఆయనని కలిసింది లేదు. అయితే దీనికి కారణం కొంతమంది ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే.. బండ్ల గణేష్ కూడా ఈ విషయంపై స్పందించి పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై కామెంట్స్ చేయడం గమనార్హం. అందుకే పవన్‌కు దూరం అయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. పవన్‌కు దూరం అయిన బండ్ల గణేష్ ఆయనను మరోసారి దేవుడితో పోల్చడం చర్చనీయాంశంగా మారింది. మరికొందరు మాత్రం రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదని.. బండ్ల గణేష్ చెప్పినట్లుగా.. కొందరు వ్యక్తుల వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్రివిక్రమ్ వల్లే బండ్లన్న పవన్‌కు దూరమయ్యారా? అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లింక్
Read More... పవన్ కళ్యాణ్ కు షాక్...ఆ మూవీ ఛాన్స్ కొట్టేసిన రవితేజ ?






